Jacob Duffy: డఫీ పాంచ్ విండీస్ 167 ఆలౌట్
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:57 AM
వెస్టిండీ్‌సతో తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఆధిక్యం అందుకుంది. రెండోరోజైన బుధవారం కరీబియన్లు తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలారు...
క్రైస్ట్‌చర్చ్: వెస్టిండీ్‌సతో తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఆధిక్యం అందుకుంది. రెండోరోజైన బుధవారం కరీబియన్లు తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలారు. హోప్ (56), చందర్‌పాల్ (52) ఫర్వాలేదనిపించారు. జాకబ్ డఫీ (5/34) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 231 రన్స్‌కు ఆలౌటైంది. ప్రస్తుతానికి కివీస్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!
ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ