ఎంతో కలచివేసింది
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:11 AM
భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై టీమిండియా మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు..

బెంగళూరు దుర్ఘటనపై ద్రవిడ్
న్యూఢిల్లీ: భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై టీమిండియా మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ఐపీఎల్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయోత్సవం సందర్భంగా జరిగిన ఈ ఘటనలో పదకొండు మంది అభిమానులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నాడు. ‘క్రీడలను ఎంతగానో ప్రేమించే నగరం బెంగళూరు. నేను అక్కడినుంచే వచ్చాను. అక్కడి ప్రజలు క్రికెట్‌నే కాదు.. ఫుట్‌బాల్, కబడ్డీ ఇలా ఏ క్రీడకైనా మద్దతిస్తారు. అలాంటి నగరంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా’ అని ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ద్రవిడ్ తెలిపాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి