జొకో మర్రే కటీఫ్
ABN , Publish Date - May 14 , 2025 | 04:13 AM
ఫ్రెంచ్ ఓపెన్‌కు రెండు వారాల ముందు సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిక్ కోచ్‌గా ఆండీ మర్రే వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. జొకోవిక్ కోచ్‌గా తాను వైదొలుగుతున్నట్టు మంగళవారం...
లండన్: ఫ్రెంచ్ ఓపెన్‌కు రెండు వారాల ముందు సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిక్ కోచ్‌గా ఆండీ మర్రే వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. జొకోవిక్ కోచ్‌గా తాను వైదొలుగుతున్నట్టు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రపంచ మాజీ నెంబర్ వన్ మర్రే ప్రకటించాడు. తామిద్దరం ఇక కలిసి ప్రయాణం చేయబోవడం లేదని మర్రే పేర్కొన్నాడు. అనంతరం ఈ ఆరు నెలల ప్రయాణంలో మర్రే తన కోసం శ్రమించిన విధానం, తను పంచిన వినోదం, అందించిన మద్దతును కొనియాడుతూ నొవాక్ సోషల్ మీడియాలో ఒక సందేశం పోస్ట్ చేశాడు. ఈ ప్రయాణంతో తమ స్నేహం మరింత బలపడిందని నొవాక్ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..