Share News

Diogo Jota death: లివర్‌ఫూల్ ఫుట్‌బాల్ స్టార్ దుర్మరణం.. పెళ్లైన పది రోజులకే..

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:01 PM

పోర్చుగీస్ స్టార్ డియోగో జోటా ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లో జమోరా ప్రావిన్స్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డియోగో మరణించాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో డియోగో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Diogo Jota death: లివర్‌ఫూల్ ఫుట్‌బాల్ స్టార్ దుర్మరణం.. పెళ్లైన పది రోజులకే..
Liverpool star Diogo Jota dies in car crash

లివర్‌ఫూల్ ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, పోర్చుగీస్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌ (Spain)లో జమోరా ప్రావిన్స్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డియోగో మరణించాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో డియోగో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో జోటా సోదరుడు ఆండ్రే ఫిలెపి కూడా ప్రాణాలు కోల్పోయాడు (Diogo Jota death).


లంబోర్గిని కారులో ప్రయాణిస్తున్న డియోగో జోటా, ఆండ్రే ఫిలెపి ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వారి లంబోర్గిని కారు టైరు పేలిపోయింది. దాంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరాగాయి. ఈ ప్రమాదంలో కారు బాగా కాలిపోవడంతో లోపల ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారని వైద్యులు నిర్ధారించారు. కాగా, డియోగోకు పది రోజుల క్రితమే వివాహం అయింది.


ఎంతో కాలం నుంచి డేటింగ్ చేస్తున్న ప్రేయసి రూటే కార్డెసోను డియోగో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ పెళ్లికి ముందే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెళ్లి జరిగిన పది రోజులకే అతడు మరణించడం చాలా మందికి బాధ కలిగిస్తోంది. కాగా, ఈ ప్రమదంలో మరణించిన డియోగో సోదరుడు ఆండ్రే కూడా ఫుట్‌బాల్ క్రీడాకారుడే. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవీ చదవండి:

సీఎస్‌కేలోకి సంజూ శాంసన్

టీమ్ కంటే బుమ్రా గొప్పా?

బ్యాటింగ్ చేతకాదు: అశ్విన్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 05:41 PM