దీపిక, సాలుంకేకు కాంస్యాలు
ABN , Publish Date - May 12 , 2025 | 05:52 AM
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-2లో రికర్వ్ ఆర్చర్లు దీపికా కుమారి, పార్థ్ సాలుంకే కాంస్య పతకాలు సాధించారు. దీంతో టోర్నీని భారత్ మొత్తం ఏడు పతకాలతో...
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-2
షాంఘై: ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-2లో రికర్వ్ ఆర్చర్లు దీపికా కుమారి, పార్థ్ సాలుంకే కాంస్య పతకాలు సాధించారు. దీంతో టోర్నీని భారత్ మొత్తం ఏడు పతకాలతో ముగించింది. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్ కాంస్యపతక పోరులో దీపిక 7-3తో కాంగ్ చయోంగ్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల వ్యక్తిగత ఈవెంట్ కాంస్య పతక మ్యాచ్‌లో సాలుంకే 6-4తో బాప్టిస్ అడ్డీస్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..