రసవత్తరం
ABN , Publish Date - Jun 13 , 2025 | 02:37 AM
వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప్స ఫైనల్ అత్యంత రసవత్తరంగా మారింది. రెండో రోజు కూడా 14 వికెట్లతో ఇరు జట్ల బౌలర్లు రాజ్యమేలారు. అయితే ఓవరాల్‌గా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 218 పరుగుల కీలక ఆధిపత్యంతో...
రెండో రోజూ 14 వికెట్లు
138కే కుప్పకూలిన దక్షిణాఫ్రికా
దెబ్బతీసిన పేసర్ కమిన్స్
ఆధిక్యంలో ఆస్ర్టేలియా
రెండో ఇన్నింగ్స్ 144/8
లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప్స ఫైనల్ అత్యంత రసవత్తరంగా మారింది. రెండో రోజు కూడా 14 వికెట్లతో ఇరు జట్ల బౌలర్లు రాజ్యమేలారు. అయితే ఓవరాల్‌గా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 218 పరుగుల కీలక ఆధిపత్యంతో పైచేయిలో ఉంది. పిచ్‌తీరును బట్టి చూస్తే మూడో రోజే ఈ టెస్టులో విజేత ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. పేసర్ కమిన్స్ (6/28) పదునైన బంతులతో దక్షిణాఫ్రికా వెన్నువిరిచాడు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఆసీ్‌సకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. మిడిలార్డర్‌లో బెడింగమ్ (45), కెప్టెన్ బవుమా (36) మాత్రమే రాణించారు. స్టార్క్‌కు రెండు, హాజెల్‌వుడ్‌కు ఓ వికెట్ దక్కింది. 43/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన సఫారీలు కమిన్స్‌ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. తొలి సెషన్‌లో బవుమా వికెట్ మాత్రమే కోల్పోగా ఐదో వికెట్‌కు బెడింగమ్‌తో అత్యధికంగా 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కమిన్స్ విజృంభణకు 8.1 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. మొత్తంగా చివరి ఆరు వికెట్లలో ఐదుగురిని అతనే పెవిలియన్‌కు చేర్చగా.. కేశవ్ (7) రనౌటయ్యాడు. మరోవైపు టెస్టుల్లో కమిన్స్ 300 వికెట్లను సైతం పూర్తి చేసుకున్నాడు.
ఆదుకున్న క్యారీ: రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్ (16 బ్యాటింగ్), లియోన్ (1 బ్యాటింగ్) ఉన్నారు. పేసర్లు ఎన్‌గిడి (3/35), రబాడ (3/44) విజృంభించడంతో ఓ దశలో ఆసీస్ 73/7 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. అయితే క్యారీ (43) అండగా నిలవడంతో జట్టు కోలుకుంది. అతడికి స్టార్క్ సహకరించడంతో ఎనిమిదో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. అలాగే ఆధిక్యం కూడా 200 దాటి సఫారీలకు సవాల్ విసిరింది.
సంక్షిప్త స్కోర్లు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్ (బెడింగమ్ 45, బవుమా 36; కమిన్స్ 6/28, స్టార్క్ 2/41); ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 144/8 (క్యారీ 43, లబుషేన్ 22; ఎన్‌గిడి 3/35, రబాడ 3/44).
1
ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా కమిన్స్ (12). అలాగే లార్డ్స్ మైదానంలో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన (6/28) కనబర్చిన కెప్టెన్‌గానూ నిలిచాడు. ఇక తాజా డబ్ల్యూటీసీ సీజన్‌లో ఎక్కువ వికెట్లు (78) పడగొట్టిన బౌలర్‌గా బుమ్రా (77)ను సైతం అధిగమించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి