Share News

Cristiano Ronaldo Retirement: త్వరలో ఆటకు వీడ్కోలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 04:59 AM

సాకర్‌ సూపర్‌స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌ ముగింపు దశకు వచ్చినట్టే. త్వరలోనే తాను ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్టు..

Cristiano Ronaldo Retirement: త్వరలో ఆటకు వీడ్కోలు

  • క్రిస్టియానో రొనాల్డో

న్యూఢిల్లీ: సాకర్‌ సూపర్‌స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (40) కెరీర్‌ ముగింపు దశకు వచ్చినట్టే. త్వరలోనే తాను ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్టు ఓ ఇంటర్వ్యూలో రొనాల్డోనే ఈ విషయాన్ని వెల్లడించాడు. కెరీర్‌కు ఎప్పుడు వీడ్కోలు పలుకుతున్నావంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘త్వరలోనే.. అందుకు మానసికంగా సన్నద్ధమవుతున్నా. ఆటను వదిలేయడం చాలా కష్టం. ఆ సమయం వస్తే మాత్రం కన్నీళ్లు ఆపుకోలేను’ అని పోర్చుగల్‌కు చెందిన రొనాల్డో తెలిపాడు. ప్రస్తుతం అల్‌ నాసర్‌ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డోకు ఆ జట్టుతో 2027 వరకు ఒప్పందం ఉంది.

Updated Date - Nov 06 , 2025 | 04:59 AM