Share News

Olympics: 2028 ఒలింపిక్స్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:15 AM

క్రికెట్‌కు లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో చోటు కల్పించిన నిర్వాహకులు.. జెంటిల్మన్‌ గేమ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు....

Olympics: 2028 ఒలింపిక్స్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ విడుదల

  • జూలై 12 నుంచి 29 వరకు మ్యాచ్‌లు

లాస్‌ ఏంజెల్స్‌: క్రికెట్‌కు లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో చోటు కల్పించిన నిర్వాహకులు.. జెంటిల్మన్‌ గేమ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. 2028 జూలై 12న క్రికెట్‌ మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్లో మొదలవుతాయి. జూలై 20, 29 తేదీల్లో మెడల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల నుంచి మొత్తం 12 జట్లు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. మ్యాచ్‌లన్నీ లాస్‌ ఏంజెల్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనా నగరంలో జరుగుతాయి. తొలిసారి, చివరిసారిగా 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పోటీలు జరిగాయి. ఆ క్రీడల్లో రెండు జట్లు మాత్రమే పోటీపడ్డ రెండ్రోజుల మ్యాచ్‌లో బ్రిటన్‌ను ఓడించి ఫ్రాన్స్‌ స్వర్ణం గెలిచింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత జెంటిల్మన్‌ గేమ్‌కు విశ్వక్రీడల్లో ప్రాతినిథ్యం దక్కింది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌/సా్‌ఫ్టబాల్‌, ప్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోస్‌ (సిక్సెస్‌), స్క్వాష్‌ క్రీడలకు కూడా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..

ఎంత పని చేశావ్ ఆర్చర్?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 03:15 AM