Share News

ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఆర్చరీ

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:04 AM

దేశ కాంపౌండ్‌ ఆర్చర్ల సుదీర్ఘ ఎదురు చూపులు ఫలించాయి. 2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఆర్చరీని ప్రవేశపెట్టనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) బుధవారం వెల్లడించింది...

ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఆర్చరీ

2028 లాస్‌ ఏంజిల్స్‌ క్రీడల్లో చోటు

న్యూఢిల్లీ: దేశ కాంపౌండ్‌ ఆర్చర్ల సుదీర్ఘ ఎదురు చూపులు ఫలించాయి. 2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఆర్చరీని ప్రవేశపెట్టనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) బుధవారం వెల్లడించింది. అయితే కేవలం మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనే పోటీలు నిర్వహిస్తారు. 1972 విశ్వ క్రీడల్లో ఆర్చరీని పునఃప్రవేశ పెట్టాక రికర్వ్‌ ఆర్చరీలో మాత్రమే పోటీలు జరుగుతున్నాయి. కాంపౌండ్‌ విభాగాన్ని కూడా ఒలింపిక్స్‌లో చేర్చాలని వరల్డ్‌ ఆర్చరీ ఎంతో కాలంగా ఐఓసీని డిమాండ్‌ చేస్తోంది. విశ్వ క్రీడల్లో మొత్తం ఐదు విభాగాలు..పురుషులు, మహిళలు వ్యక్తిగత, పురుషులు, మహిళలు టీమ్‌, మిక్స్‌డ్‌లో పోటీలు జరుగుతున్నాయి. ఇప్పుడు..కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంతో కలిపి ఆరుకు చేరతాయి.

జ్యోతి సురేఖ హర్షం: కాంపౌండ్‌ వ్యక్తిగత, టీమ్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాలలో తెలుగు ఆర్చర్‌ వెన్నం జ్యోతిసురేఖ ప్రపంచ పోటీలలో అద్భుతంగా రాణిస్తోంది. వరల్డ్‌ కప్‌, వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప, ఆసియా క్రీడల్లో ఆమె ఈ విభాగాలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కొల్లగొట్టింది. ఒలింపిక్స్‌లో కూడా కాంపౌండ్‌ ఆర్చరీని ప్రవేశపెడితే స్వర్ణం గెలవగలనన్న ధీమాతో ఆమె ఉంది. ఈనేపథ్యంలో ఓఐసీ నిర్ణయంతో 28 ఏళ్ల జ్యోతి సురేఖ హర్షం వ్యక్తంజేసింది.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి యాడ్స్, ప్రమోషన్స్ తొలగింపు.. కారణం ఏంటి

IPL 2025, GT vs RR: అండర్‌డాగ్స్ పోరులో విజేత ఎవరు.. గుజరాత్‌కు రాజస్తాన్ బ్రేక్‌లు వేస్తుందా

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 03:04 AM