Share News

గాఫ్‌కు ఝలక్‌

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:37 AM

వింబుల్డన్‌లో ఊహించని షాక్‌. ఇటీవలే ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గి సమరోత్సాహంతో ఉన్న మహిళల రెండోసీడ్‌ కొకొ గాఫ్‌ అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఈ అమెరికా స్టార్‌కు...

గాఫ్‌కు ఝలక్‌

డయానా చేతిలో ఓటమి

  • మూడోరౌండ్‌కు సబలెంక, అల్కారజ్‌

  • జొకోవిచ్‌ బోణీఫ వింబుల్డన్‌

లండన్‌: వింబుల్డన్‌లో ఊహించని షాక్‌. ఇటీవలే ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గి సమరోత్సాహంతో ఉన్న మహిళల రెండోసీడ్‌ కొకొ గాఫ్‌ అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఈ అమెరికా స్టార్‌కు ఉక్రెయిన్‌ భామ డయానా యాస్ట్రెమ్‌స్కా ఝలకిచ్చింది. ప్రపంచ 46వ ర్యాంకరైన 25 ఏళ్ల డయానా 7-6 (7-3), 6-1తో ప్రపంచ నెంబర్‌ 2 గాఫ్‌ను కంగుతినిపించి రెండోరౌండ్‌కు చేరింది. 21 ఏళ్ల గాఫ్‌.. ఓ గ్రాండ్‌స్లామ్‌లో మొదటిరౌండ్లోనే ఓడడం 2023 తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు టాప్‌సీడ్‌ సబలెంక 7-6(7-4), 6-4తో మేరీ బౌజ్కోవాపై గెలిచి మూడోరౌండ్‌ చేరింది. 6వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ 6-4, 6-2తో డానిలోవిచ్‌ నెగ్గింది. చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ పెట్రా క్విటోవాకు తానాడిన చివరి వింబుల్డన్‌లో నిరాశే ఎదురైంది. తొలిరౌండ్లోనే ఓటమిపాలైంది.


గట్టెక్కిన జొకో: పురుషుల సింగిల్స్‌లో 25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలోనున్న సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ తొలిరౌండ్‌ను అధిగమించాడు. ఆరోసీడ్‌ జొకోవిచ్‌ 6-1, 6-7(7-9), 6-2, 6-2తో ముల్లర్‌పై గెలిచాడు. ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత, టాప్‌సీడ్‌ కార్లోస్‌ అల్కారజ్‌ 6-1, 6-4, 6-4తో టార్వెట్‌పై అలవోకగా నెగ్గి మూడోరౌండ్లో అడుగుపెట్టాడు. 14వ సీడ్‌ రుబ్లెవ్‌ 6-7(1-7), 6-4, 7-6(7-5), 6-3తో హారి్‌సను ఓడించగా, స్థానిక ఆటగాడు నోరి 4-6, 6-4, 6-3, 7-5తో 12వ సీడ్‌ టియాఫోను రెండోరౌండ్లోనే ఇంటిబాట పట్టించాడు.

యుకీ జోడీ బోణీ: భారత డబుల్స్‌ ఆటగాడు యుకీ భాంబ్రీ శుభారంభం చేశాడు. డబుల్స్‌ తొలిరౌండ్లో 16వ సీడ్‌ యుకీ/రాబర్ట్‌ గాలోవే (అమెరికా) జోడీ 7-6(8), 6-4తో రొమైన్‌ (మొనాకో)/మాన్యుయెల్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:37 AM