Coach Gambhir: ఆ ఇద్దరి స్థానాల భర్తీ కష్టమే
ABN , Publish Date - May 24 , 2025 | 02:09 AM
కోచ్ గంభీర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్టు రిటైర్మెంట్‌పై స్పందిస్తూ, వారి స్థానాలు భర్తీ చేయడం కష్టమని అన్నారు. అయితే యువ ఆటగాళ్లకు అవకాశం ఉంటుందని చెప్పారు.
కోచ్ గంభీర్
న్యూఢిల్లీ: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్టు రిటైర్మెంట్‌పై కోచ్ గంభీర్ స్పందించాడు. ఆ ఇద్దరి స్థానాలను భర్తీ చేయడం కష్టమేనని అంగీకరించాడు. కానీ యువ ఆటగాళ్లకు ఇదో చక్కటి అవకాశంగా పేర్కొన్నాడు. ‘టీమిండియాకు ఇప్పుడు ఇద్దరు సీనియర్లు లేకుండా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. అయినా రోహిత్, విరాట్ లేకుండా ఆడడం కాస్త కష్టమే. అయితే ఇతర ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునే చాన్స్ దక్కుతుంది. చాంపియన్స్ ట్రోఫీ సమయంలో పేసర్ బుమ్రా అందుబాటులో లేడు. అప్పుడు కూడా నేనిదే విషయం చెప్పాను. ఎవరైనా లేకపోతే మరొకరు జాతీయ జట్టులో చోటు దక్కించుకుని నిరూపించుకుంటారు. అలాంటి అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు కూడా’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.