Share News

బ్రేవిస్‌ అదుర్స్‌

ABN , Publish Date - May 08 , 2025 | 05:09 AM

డెవాల్డ్‌ బ్రేవిస్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) మలుపుతిప్పే ఆటతో.. డిఫెండింగ్‌ చాంప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ఆవిరయ్యాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో...

బ్రేవిస్‌ అదుర్స్‌

ఐపీఎల్‌లో నేడు

పంజాబ్‌ X ఢిల్లీ

వేదిక : ధర్మశాల, రా.7.30 నుంచి

  • చెన్నైకి మూడో విజయం

  • కోల్‌కతా నాకౌట్‌ ఆశలు ఆవిరి?

  • నూర్‌కు 4 వికెట్లు

కోల్‌కతా: డెవాల్డ్‌ బ్రేవిస్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) మలుపుతిప్పే ఆటతో.. డిఫెండింగ్‌ చాంప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ఆవిరయ్యాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2 వికెట్లతో కోల్‌కతాపై గెలిచింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. రహానె (48), రస్సెల్‌ (38), మనీష్‌ పాండే (36 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నూర్‌ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో చెన్నై 19.4 ఓవర్లలో 183/8 స్కోరు చేసి గెలిచింది. శివమ్‌ దూబే (45), ఉర్విల్‌ పటేల్‌ (31) రాణించారు. వైభవ్‌ అరోరా 3 వికెట్లు తీశాడు.

ఆశలులేని స్థితి నుంచి..: పవర్‌ప్లేలో 62/5తో టాప్‌-5 వికెట్లు చేజార్చుకొన్న చెన్నై.. మ్యాచ్‌పై దాదాపుగా ఆశలు వదిలేసుకొంది. కానీ, దూబేతో కలసి బ్రేవిస్‌ ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించడంతో ఒక్కసారిగా మ్యాచ్‌లోకి వచ్చింది. 11వ ఓవర్‌లో అరోరా బౌలింగ్‌లో చెలరేగిన బ్రేవిస్‌ 3 సిక్స్‌లు, 3 ఫోర్లతో 30 పరుగులు రాబట్టడం హైలైట్‌. అయితే, ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న బ్రేవి్‌సను వరుణ్‌ అవుట్‌ చేశాడు. విజయానికి చివరి 5 ఓవర్లలో 40 రన్స్‌ అవసరమవగా.. ధోనీ (17 నాటౌట్‌), దూబే ఏడో వికెట్‌కు 43 రన్స్‌ భాగస్వామ్యంతో గెలుపుముంగిట నిలిపారు. దూబేను కూడా అరోరా అవుట్‌ చేసినా.. అన్షుల్‌ (4 నాటౌట్‌) ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఓపెనర్లు మాత్రె(0), కాన్వే (0) డకౌటవగా, ఉర్విల్‌ను హర్షిత్‌ అవుట్‌ చేశాడు. అశ్విన్‌ (8), జడేజా (19) నిరాశపర్చారు.


దెబ్బకొట్టిన నూర్‌: స్పిన్నర్‌ నూర్‌ దెబ్బకు కోల్‌కతా ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్‌ గుర్బాజ్‌ (11) విఫలమైనా.. నరైన్‌ (26), రహానె రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. దీంతో పవర్‌ప్లేను కోల్‌కతా 67/1తో ముగించింది. కానీ, 8వ ఓవర్‌లో నరైన్‌, రఘువంశీ (1)ని అవుట్‌ చేసిన నూర్‌ దెబ్బకొట్టాడు. రహానెను జడేజా బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో రస్సెల్‌.. మనీ్‌షతో కలసి ధాటిగా ఆడుతూ స్కోరు వేగం పెంచాడు. అయితే, రస్సెల్‌, రింకూ సింగ్‌ (9)ను కూడా నూర్‌ అవుట్‌ చేశాడు.

స్కోరు బోర్డు

కోల్‌కతా: గుర్బాజ్‌ (సి) నూర్‌ (బి) అన్షుల్‌ 11, నరైన్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) నూర్‌ 26, రహానె (సి) కాన్వే (బి) జడేజా 48, రఘువంశీ (సి) ధోనీ (బి) నూర్‌ 1, మనీష్‌ (నాటౌట్‌) 36, రస్సెల్‌ (సి) బ్రేవిస్‌ (బి) నూర్‌ 38, రింకూ (సి) మాత్రె (బి) నూర్‌ 9, రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 179/6; వికెట్ల పతనం: 1-11, 2-69, 3-71, 4-103, 5-149, 6-167; బౌలింగ్‌: ఖలీల్‌ 2-0-14-0, అన్షుల్‌ 3-0-38-1, అశ్విన్‌ 3-0-19-0, నూర్‌ అహ్మద్‌ 4-0-31-4, జడేజా 4-0-34-1, పతిరన 4-0-39-0.

చెన్నై: ఆయుష్‌ మాత్రె (సి) హర్షిత్‌ (బి) అరోరా 0, కాన్వే (బి) అలీ 0, ఉర్విల్‌ (సి) వరుణ్‌ (బి) హర్షిత్‌ 31, అశ్విన్‌ (సి) రఘువంశీ (బి) హర్షిత్‌ 8, జడేజా (బి) వరుణ్‌ 19, డెవాల్డ్‌ బ్రేవిస్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 52, శివమ్‌ దూబే (సి) రింకూ (బి) అరోరా 45, ధోనీ (నాటౌట్‌) 17, నూర్‌ (సి) రింకూ (బి) అరోరా 2, అన్షుల్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.4 ఓవర్లలో 183/8; వికెట్ల పతనం: 1-0, 2-25, 3-37, 4-56, 5-60, 6-127, 7-170, 8-172; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 3-0-48-3, మొయిన్‌ అలీ 2-0-23-1, హర్షిత్‌ 4-0-43-2, వరుణ్‌ 4-0-18-2, నరైన్‌ 4-0-28-0, రస్సెల్‌ 2.4-0-22-0. నూర్‌ అహ్మద్‌ (4/31)


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 11 8 3 0 16 0.793

బెంగళూరు 11 8 3 0 16 0.482

పంజాబ్‌ 11 7 3 1 15 0.376

ముంబై 12 7 5 0 14 1.156

ఢిల్లీ 11 6 4 1 13 0.362

కోల్‌కతా 12 5 6 1 11 0.193

లఖ్‌నవూ 11 5 6 0 10 -0.469

హైదరాబాద్‌ 11 3 7 1 7 -1.192

రాజస్థాన్‌ 12 3 9 0 6 -0.718

చెన్నై 12 3 9 0 6 -0.992

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 05:09 AM