Khelo India University Games 2025: చికిత డబుల్ ధమాకా
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:04 AM
ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో తెలుగమ్మాయి చికితరావు రెండు పతకాలు కొల్లగొట్టింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల్లో తెలుగమ్మాయి చికితరావు రెండు పతకాలు కొల్లగొట్టింది. రాజస్థాన్‌లో శనివారం జరిగిన కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో రజతం సాధించింది. అదితి గోపిచంద్ స్వర్ణం దక్కించుకుంది. ఇక, టీమ్ విభాగంలో ఎల్‌పీ విశ్వవిద్యాలయం తరఫున బరిలోకి దిగిన చికిత, సునైనా, మధుర వర్షిణి త్రయం స్వర్ణం కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?