Duleep Trophy: గెలుపు దిశగా ‘సెంట్రల్’ సౌత్‌జోన్‌తో దులీప్ ట్రోఫీ
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:05 AM
దులీప్ ట్రోఫీని 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతం చేసుకునేందుకు సెంట్రల్‌జోన్ 65 పరుగుల దూరంలో నిలిచింది. ఆటకు నాలుగో రోజైన...
బెంగళూరు: దులీప్ ట్రోఫీని 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతం చేసుకునేందుకు సెంట్రల్‌జోన్ 65 పరుగుల దూరంలో నిలిచింది. ఆటకు నాలుగో రోజైన ఆదివారం సౌత్‌జోన్ మిడిలార్డర్ బ్యాటర్లు అంకిత్ శర్మ, సిద్ధార్థ్ అద్భుతమైన పోరాటంతో ఏడో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో దక్షిణాది జట్టు 426 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్‌జోన్ బౌలర్లలో కార్తికేయ 4, సారాంశ్ జైన్ 3 వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్ 149, సెంట్రల్‌జోన్ 511 పరుగులు చేశాయి.