హ్యాట్రిక్‌పై అల్కారజ్ గురి
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:42 AM
డబుల్ డిఫెండింగ్ చాంప్ కార్లోస్ అల్కారజ్ మరోసారి వింబుల్డన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం నుంచి జరిగే గ్రాస్‌కోర్ట్ గ్రాండ్‌స్లామ్‌లో రెండో సీడ్ అల్కారజ్ విజేతగా నిలిస్తే...
వింబుల్డన్ నేటి నుంచి
మ.3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో..
టాప్ సీడ్‌గా సినర్
25వ గ్రాండ్‌స్లామ్ వేటలో జొకోవిచ్
మహిళల ఫేవరెట్లు గాఫ్, సబలెంక
లండన్: డబుల్ డిఫెండింగ్ చాంప్ కార్లోస్ అల్కారజ్ మరోసారి వింబుల్డన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం నుంచి జరిగే గ్రాస్‌కోర్ట్ గ్రాండ్‌స్లామ్‌లో రెండో సీడ్ అల్కారజ్ విజేతగా నిలిస్తే.. దిగ్గజం రోజర్ ఫెడరర్ తర్వాత హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. గతేడాది అల్కారజ్ చేతిలో ఓడి రన్నర్‌పగా నిలిచిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ తన 25వ టైటిల్ కలను నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. కానీ, ఇటీవలి ఫామ్‌తోపాటు జొకో ఫిట్‌నెస్ చూస్తుంటే కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్న జొకో తొలి రౌండ్‌లో అలెగ్జాండర్ ముల్లర్‌తో తలపడనున్నాడు. అయితే, క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జాక్ డ్రేపర్ రూపంలో నొవాక్‌కు అసలుసిసలు సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది గట్టెక్కితే సెమీ్‌సలో టాప్ సీడ్ జానిక్ సినర్‌తో ఆడాల్సి రావచ్చు. తొలి రౌండ్‌లో లూకా నర్డీ (ఇటలీ)తో సినర్, ఫాబియో ఫాగ్‌ని (ఇటలీ)తో అల్కారజ్ ఆడనున్నారు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మెద్వెదెవ్, ఆండీ రుబ్లేవ్, హోల్డర్ రూన్ కూడా సత్తా చాటాలనుకొంటున్నారు.

మహిళల పోటీ రసవత్తరం
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరియానా సబలెంక, ఫ్రెంచ్ ఓపెన్ విజేత కొకొ గాఫ్, 8వ సీడ్ ఇగా స్వియటెక్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. 2016లో సెరెనా విలియమ్స్ ఏడో టైటిల్ సాధించిన తర్వాత.. వరుసగా కొత్త చాంపియన్లే వస్తున్నారు. కాగా, డిఫెండింగ్ చాంప్ బార్బరా క్రెజికోవా పేలవ ఫామ్ కొనసాగుతుండడంతో ఆమెపై పెద్దగా అంచనాలు లేవు. సబలెంక ముందుకు సాగితే.. క్వార్టర్స్‌లో మాడిసన్ కీస్‌ను ఎదుర్కోవాల్సి రావచ్చు. గతేడాది రన్నరప్, నాలుగో సీడ్ జాస్మిన్ పౌలినీకి క్వార్టర్స్‌లో క్విన్‌వెన్ జాంగ్ రూపంలో గట్టిసవాల్ ఎదురుకావచ్చు. రెండో సీడ్ కొకొ గాఫ్.. తొలి రౌండ్‌లో డయానా ఎస్ట్రీమ్‌స్కాతో, కుదర్మెటోవాతో స్వియటెక్ తలపడనున్నారు. రిబకినా, మిర్రా ఆండ్రీ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకొంటున్నారు.
లైన్ జడ్జిలు లేకుండా..
147 ఏళ్ల వింబుల్డన్ చరిత్రలో తొలిసారి లైన్ జడ్జిలు లేకుండా టోర్నీ జరగనుంది. టెక్నాలజీకి పెద్ద పీట వేసిన నిర్వాహకులు ఎలకా్ట్రనిక్ లైన్ కాలింగ్ సిస్టమ్‌ను తొలిసారి ఉపయోగించనున్నారు. ఇందుకోసం 450 ట్రాకింగ్ కెమెరాలను కూడా ఉపయోగించనున్నారు. అంతేకాకుండా సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లను రెండు గంటలు ఆలస్యంగా అంటే.. సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ప్రైజ్‌మనీని కూడా గతేడాదితో పోల్చితే 11 శాతం పెంచారు.
ఇవీ చదవండి:
గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి