Harmanpreet Kaur Gets World Cup Tattoo: చెరగని గుర్తుగా!
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:00 AM
భారత మహిళల జట్టుకు తొలి వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ ఘట్టాన్ని చెరగని గుర్తుగా మార్చుకొంది...
కెప్టెన్ హర్మన్ ‘వరల్డ్‌కప్’ టాటూ
న్యూఢిల్లీ: భారత మహిళల జట్టుకు తొలి వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ ఘట్టాన్ని చెరగని గుర్తుగా మార్చుకొంది. తన చేతిపై ప్రపంచకప్ టాటూను వేయించుకొంది. ఈ ఫొటోను ఆమె నెట్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ప్రపంచకప్ ట్రోఫీతోపాటు గెలిచిన సంవత్సరం ‘2025’తో పాటు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల విజయాన్ని గుర్తుచేసేలా ‘52’ టాటూపై కనిపిస్తున్నాయి.