పదిహేనేళ్లలో తొలిసారి
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:15 AM
భారత టెన్నిస్ వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పదిహేనేళ్లలో తొలిసారిగా ర్యాంకింగ్స్‌లో టాప్-50లో చోటు కోల్పోయాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో...

ర్యాంకింగ్స్‌లో టాప్-50 నుంచి బోపన్న అవుట్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పదిహేనేళ్లలో తొలిసారిగా ర్యాంకింగ్స్‌లో టాప్-50లో చోటు కోల్పోయాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన బోపన్న 20 స్థానాలు చేజార్చుకొని 53వ ర్యాంక్‌లో నిలిచాడు. గతంలో 2015 జూన్‌లో బోపన్న 52వ స్థానంలో నిలిచాడు. 45 ఏళ్ల బోపన్న నిరుడు ఏకంగా డబుల్స్‌లో వరల్డ్ నెంబర్‌వన్‌గా నిలిచి, ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆరు స్థానాలు ఎగబాకిన యుకీ భాంబ్రీ 35వ ర్యాంక్‌తో భారత్ తరఫున డబుల్స్‌లో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. డబుల్స్‌లో తెలుగు ఆటగాడు రిత్విక్ బొల్లిపల్లి 72, విజయ్‌సుందర్ 100వ ర్యాంక్‌లో ఉన్నారు. ఇక సింగిల్స్‌లో సుమిత్ నగాల్ ఏకంగా 63 స్థానాలు కోల్పోయి 233వ ర్యాంక్‌లో నిలిచాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి