రూ 538 కోట్లు చెల్లించాల్సిందే
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:32 AM
బాంబే హైకోర్టులో బీసీసీఐకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ జట్టు కొచ్చి టస్కర్స్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. కొచ్చి ఫ్రాంచైజీకి రూ. 538 కోట్లు పరిహారంగా చెల్లించాలని,,,
బీసీసీఐకి బాంబే హైకోర్టు షాక్
కొచ్చి టస్కర్స్ కేసులో తీర్పు
ముంబై: బాంబే హైకోర్టులో బీసీసీఐకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ జట్టు కొచ్చి టస్కర్స్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. కొచ్చి ఫ్రాంచైజీకి రూ. 538 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. వివరాలేంటంటే.. ఐపీఎల్‌లో కొచ్చి టస్కర్స్ 2011 సీజన్‌లో మాత్రమే ఆడింది. ఆపై..తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ టస్కర్స్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తొలగించింది. బ్యాంకు గ్యారెంటీనీ సరైన సమయంలో అందజేయకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వివరించింది. దాంతో కొచ్చి జట్టు 2012 ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ట్రిబ్యునల్ కొచ్చికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తొలగింపునకు పరిహారంగా రూ. 538 కోట్లను టస్కర్స్‌కు చెల్లించాలని బోర్డును ఆదేశించింది. అయితే ట్రిబ్యునల్ తీర్పును బాంబే హైకోర్టులో బీసీసీఐ సవాలు చేసింది. దీనిపై విచారించిన ఏకసభ్య ధర్మాసనం జడ్జి ఆర్‌ఐ చాగ్లా బీసీసీఐ పిటిషన్‌ను కొట్టివేశారు. కొచ్చికి రూ. 538 కోట్లు చెల్లించాలన్న అర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పును సమర్థించారు. కాగా..తీర్పుపై బీసీసీఐ స్పందన తెలియరాలేదు. హైకోర్టును తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తుందేమో చూడాలి.
ఇవీ చదవండి:
నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..
18 నంబర్ జెర్సీ.. సిరీస్‌లో ఇదే హైలైట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి