మందు మానేశా
ABN , Publish Date - May 20 , 2025 | 03:54 AM
గతేడాది డిసెంబరులో గాయపడిన ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. ఈనెల 22 నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో ఆడబోతున్నాడు...
లండన్: గతేడాది డిసెంబరులో గాయపడిన ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. ఈనెల 22 నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో ఆడబోతున్నాడు. అయితే గాయాల నుంచి కోలుకునేందుకు చాలా కష్టపడాల్సి వస్తోందని స్టోక్స్ తెలిపాడు. కివీస్ టూర్‌లో తొడకండరాల గాయం తర్వాత తాను మద్యం మానేశానని తెలిపాడు. ఎందుకంటే 2023లోనూ ఇదే గాయానికి గురి కావడంతో ఈసారి జాగ్రత్త పడాలని భావించినట్టు స్టోక్స్ చెప్పాడు. అత్యుత్తమ ఫిట్‌నెస్ అందుకోవడానికే ఇలా చేశానని, అయితే శాశ్వతంగా మందు మానేసే ఆలోచన మాత్రం లేదని తేల్చాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..