Share News

టెస్టు వేదికలు మారాయ్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 04:59 AM

భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాలతో అక్టోబరు నుంచి టెస్టు, పరిమిత ఓవర్ల సిరీ్‌సలను ఆడనుంది. దీనిలో భాగంగా ఇదివరకు...

టెస్టు వేదికలు మారాయ్‌

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాలతో అక్టోబరు నుంచి టెస్టు, పరిమిత ఓవర్ల సిరీ్‌సలను ఆడనుంది. దీనిలో భాగంగా ఇదివరకు ప్రకటించిన వేదికల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబరు 2 నుంచి వెస్టిండీ్‌సతో తొలి టెస్టు అహ్మదాబాద్‌లోనే జరుగనుండగా.. చివరిదైన రెండో టెస్టు వేదికను మాత్రం కోల్‌కతా నుంచి న్యూఢిల్లీకి మార్చారు. అలాగే నవంబరు 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టును ఢిల్లీ నుంచి కోల్‌కతాకు తరలించారు. ఇక సెప్టెంబరు 14 నుంచి జరిగే భారత్‌-ఆస్ట్రేలియా మహిళల వన్డే సిరీ్‌సలోని మూడో మ్యాచ్‌ను చెన్నై నుంచి ఢిల్లీకి తరలించారు.

ఇవీ చదవండి:

ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి

లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 04:59 AM