బీసీసీఐ అంబుడ్స్‌మన్ కీలక ఉత్తర్వులు
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:14 AM
జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మినహా తెలంగాణలోని ఇతర జిల్లాలో గత 50 ఏళ్లుగా క్రికెట్ అభివృద్ధిని హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) నిర్లక్ష్యం...

ఆగంరావు ఫిర్యాదుపై స్పందన
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మినహా తెలంగాణలోని ఇతర జిల్లాలో గత 50 ఏళ్లుగా క్రికెట్ అభివృద్ధిని హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) నిర్లక్ష్యం చేసిందని కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగంరావు ఈనెల 8న బీసీసీఐకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. హెచ్‌సీఏ కేటాయించిన నిధులతో సహా జిల్లాల్లో క్రికెటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను లేఖలో ప్రస్తావించారు. హెచ్‌సీఏలో రెండు జిల్లాల నుంచే 96 శాతం ప్రాతినిధ్యం ఉందని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 33 జిల్లాల ప్రాతిపదికన కొత్త జిల్లాలకు ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఈ ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, బీసీసీఐ అంబుడ్స్‌మన్ అరుణ్ కుమార్ మిశ్రా.. బోర్డు నిబంధనల ప్రకారం ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అపెక్స్ కౌన్సిల్‌ను ఆదేశించారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..