Share News

అప్పుడే గుడ్‌బై చెబుతాడనుకుంది

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:11 AM

రోహిత్‌ శర్మ..తెల్లబంతుల ఫార్మాట్‌లో అన్ని తరాలకు నిస్సందేహంగా గొప్ప క్రికెటర్‌. 38 ఏళ్ల రోహిత్‌ టీ20లలో అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌. అలాగే వన్డేలలో 11వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాడు...

అప్పుడే గుడ్‌బై చెబుతాడనుకుంది

రోహిత్‌ వన్డే భవితవ్యంపై బీసీసీఐ

న్యూఢిల్లీ: రోహిత్‌ శర్మ..తెల్లబంతుల ఫార్మాట్‌లో అన్ని తరాలకు నిస్సందేహంగా గొప్ప క్రికెటర్‌. 38 ఏళ్ల రోహిత్‌ టీ20లలో అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌. అలాగే వన్డేలలో 11వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాడు. నిరుడు జూన్‌లో టీమిండియా వరల్డ్‌ కప్‌ నెగ్గాక పొట్టి ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తాజాగా టెస్ట్‌లకూ వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితమైన రోహిత్‌ 2027 వన్డే ప్రపంచ కప్‌ ఆడాలన్న పట్టుదలతో ఉన్నాడు. కానీ గత మార్చిలో ముగిసిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత హిట్‌మ్యాన్‌ వన్డేలకు గుడ్‌బై చెబుతాడని బీసీసీఐ భావించిందట! ‘నిజం చెప్పాలంటే..చాంపియన్స్‌ ట్రోఫీ అందుకున్నాక రోహిత్‌ వన్డేలకూ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అంచనా వేశాం. అయితే రోహిత్‌ వన్డే భవితవ్యంపై అతడికి, సెలెక్టర్లకు నడుమ ఎలాంటి చర్చా జరగలేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. భారత జట్టు తదుపరి వన్డే సిరీ్‌సను ఆగస్టులో బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితుల రీత్యా చూస్తే ఆ సిరీస్‌ జరిగేది అనుమానమే. అది రద్దయితే అక్టోబరులో మూడు వన్డేల సిరీ్‌సకోసం భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. కాగా..సౌతాఫ్రికా ఆతిథ్యమిచ్చే తదుపరి వన్డే వరల్డ్‌ కప్‌నకు రెండేళ్లకు పైగా వ్యవధి ఉంది. ఆ మెగా టోర్నీ సమయానికి రోహిత్‌ 40వ ఏట ప్రవేశిస్తాడు.


అయితే రాబోయే వన్డే వరల్డ్‌ కప్‌ వరకూ అతడు ఇదే స్థాయిలో దూకుడుగా ఆడగలడా..అన్నది ప్రశ్న. ఈ క్రమంలో రోహిత్‌ కెప్టెన్సీ నిలబెట్టుకుంటాడా అనేది కూడా చూడాలి. సారథ్య బాధ్యతలు లేకపోవడం రోహిత్‌కు ప్రతికూలమే కాగలదు. ఇప్పటికే భిన్న ఫార్మాట్లకు భిన్న సారథుల దిశగా భారత క్రికెట్‌ అడుగులు వేస్తోంది. టీ20లకు సూర్యకుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక టెస్ట్‌ జట్టు గిల్‌ సారథ్యం వహిస్తున్నాడు. ఈక్రమంలో వన్డేలకూ కొత్త నాయకుడిని ఎంపిక చేసే అవకాశాలు ఎంతో దూరంలో లేకపోలేదు.


ఇవీ చదవండి:

ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి

లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 05:11 AM