Share News

మాపై స్లెడ్జింగ్‌కు దిగారు

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:59 AM

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తమను మానసికంగా దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా జట్టు స్లెడ్జింగ్‌కు దిగిందని...

మాపై స్లెడ్జింగ్‌కు దిగారు

సఫారీ సారథి బవుమా

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తమను మానసికంగా దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా జట్టు స్లెడ్జింగ్‌కు దిగిందని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమా ఆరోపించాడు. నాలుగో రోజు ఆటలో సఫారీలు తమ విజయానికి 69 పరుగుల దూరంలో ఉండగా.. తొలి సెషన్‌లో ఆసీస్‌ మాటల యుద్ధానికి దిగిందట. ‘మేం బ్యాటింగ్‌ చేసే సమయంలో చోకర్స్‌ అనే మాట కూడా వినాల్సి వచ్చింది. ఓ ప్లేయర్‌ అయితే 60 పరుగుల్లోపే మిగిలిన 8 వికెట్లు కూడా కోల్పోతారంటూ ఎద్దేవా చేశాడు. మార్‌క్రమ్‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని పట్టించుకోవద్దని చెప్పాడు’ అని బవుమా తెలిపాడు.

ఇవీ చదవండి:

ఐదేళ్లలో 6 ఐసీసీ టోర్నీలు

వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 03:59 AM