Hardik Rathi Death: పోల్ ఆటగాడి ప్రాణం తీసింది
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:56 AM
Basketball Pole Kills National Player in Rohatk Haryana
రోహ్‌తక్ (హరియాణా): తాను రోజూ సాధన చేసే బాస్కెట్‌బాల్ కోర్టు..అందులోని బాస్కెట్‌బాల్ పోల్ ఆ జాతీయస్థాయి క్రీడాకారుడికి మరణ శాసనమైంది. హార్ధిక్ రథి (16) రోజుమాదిరే ఇక్కడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. బంతిని బాస్కెట్‌లో వేసే సాధన క్రమంలో తుప్పుపట్టిన బాస్కెట్‌బాల్ పోల్ అతడిపై పడింది. గమనించిన సహచర ఆటగాళ్లు పోల్‌ను పక్కకుతీసి హార్దిక్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.