Share News

బంగ్లా చెస్‌ ప్లేయర్‌ను తిప్పిపంపిన అధికారులు

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:02 AM

గతంలో వీసా నిబంధనలు ఉల్లంఘించిన బంగ్లాదేశ్‌ చెస్‌ క్రీడాకారిణికి భారత ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకొని తర్వాతి రోజు...

బంగ్లా చెస్‌ ప్లేయర్‌ను తిప్పిపంపిన అధికారులు

న్యూఢిల్లీ: గతంలో వీసా నిబంధనలు ఉల్లంఘించిన బంగ్లాదేశ్‌ చెస్‌ క్రీడాకారిణికి భారత ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకొని తర్వాతి రోజు తిప్పిపంపారు. ఢిల్లీ అంతర్జాతీయ ఓపెన్‌ గ్రాండ్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో పాల్గొనేందుకు బంగ్లా వెటరన్‌ ఐఎం రాణీ హమీద్‌ అలియాస్‌ సయీదా జసిమున్నీసా ఖాతూన్‌ (80) వచ్చింది. ఆమె తనకు తోడుగా మరో క్రీడాకారిణి ఆషియా సుల్తానా (37)ను భారత్‌కు తీసుకొచ్చింది. అయితే, సుల్తానా గతంలో మెడికల్‌ వీసాపై వచ్చి కోల్‌కతాలో ఓ టోర్నీలో పాల్గొంది. దీంతో ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ ఆమెను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో దిగగానే సుల్తానాను అదుపులోకి తీసుకొన్న అధికారులు.. మరో విమానంలో బంగ్లాకు తిప్పిపంపారు. ఈ ఘటనపై హమీద్‌ మాట్లాడుతూ ప్రయాణంలో వృద్ధురాలైన తనకు సుల్తానా ఎంతో సాయంగా ఉండేదని చెప్పింది.

ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 05:02 AM