బంగ్లాదేశ్ 220 పరుగులు 8 వికెట్లకు
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:00 AM
శ్రీలంక బౌలర్లు సమష్టిగా రాణించడంతో బుధవారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తొలిరోజు ఆఖరికి బంగ్లాదేశ్ 8 వికెట్లకు 220 పరుగులు చేసింది. 76 పరుగులకే...
శ్రీలంకతో రెండో టెస్ట్
కొలంబో: శ్రీలంక బౌలర్లు సమష్టిగా రాణించడంతో బుధవారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తొలిరోజు ఆఖరికి బంగ్లాదేశ్ 8 వికెట్లకు 220 పరుగులు చేసింది. 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో ముష్ఫికర్ రహీమ్ (35), లిటన్ దాస్ (34) ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. అంతకుముందు ఓపెనర్ షాద్‌మన్ ఇస్లామ్ (46) మినహా టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. భోజన విరామం తర్వాత గంటన్నరపాటు వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది.
ధోనీ, ఇంజమామ్‌ను దాటేసిన ముష్ఫికర్: బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్..భారత దిగ్గజం ఎంఎస్ ధోనీ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ రికార్డులను తిరగ రాశాడు. శ్రీలంకపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు (3100) చేసిన ఏడో బ్యాటర్‌గా ముష్ఫికర్ నిలిచాడు. ఈక్రమంలో ధోనీ (3087)ని ముష్ఫికర్ అధిగమించాడు. అలాగే శ్రీలంకపై అత్యధిక టెస్ట్ పరుగులు (1593) చేసిన ముష్ఫికర్..హక్ (1559)ను వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరాడు.
ఇవీ చదవండి:
రిషభ్ పంత్ సెంచరీ చేస్తే అదే జరుగుతుందా.. టీమిండియా ఓటమికి అతడే కారణమా..
బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..
శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఓటమి ఎలాంటిదంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి