బంగ్లాదేశ్ 484 9
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:28 AM
శ్రీలంకతో తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆఖరికి బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లకు 484 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ 292/3 స్కోరుతో...
శ్రీలంకతో తొలి టెస్ట్
గాలె: శ్రీలంకతో తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆఖరికి బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లకు 484 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ 292/3 స్కోరుతో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 192 పరుగులు జోడించి 6 వికెట్లు కోల్పోయింది. కిందటి రోజు బ్యాటర్లు షంటో (148), ముష్ఫికర్ రహీమ్ (163) నాలుగో వికెట్‌కు 264 పరుగులు జోడించారు. అనంతరం లిటన్ దాస్ (90) జతగా ఐదో వికెట్‌కు ముష్ఫికర్ మరో 149 రన్స్ జత చేశాడు. అయితే రెండు గంటల పాటు వర్షంతో ఆటకు అంతరాయం ఏర్పడి తిరిగి మొదలయ్యాక లంక బౌలర్లు విజృంభించారు. 20.4 ఓవర్లు బౌల్ చేసి 61 పరుగులే ఇచ్చి 5 బంగ్లా వికెట్లు పడగొట్టారు.
ఇవీ చదవండి:
నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..
18 నంబర్ జెర్సీ.. సిరీస్‌లో ఇదే హైలైట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి