Nigar Sultana controversy: కెప్టెన్ జూనియర్లను కొడుతోంది
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:03 AM
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ కెప్టెన్ నిగర్ సుల్తానా జూనియర్ క్రికెటర్లను తన రూముకి పిలిచిమరీ కొడుతోందని ఆ జట్టు పేస్ బౌలర్ జహనారా..
బంగ్లా సారథి సుల్తానాపై జట్టు సభ్యురాలి ఆరోపణ
ఢాకా: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ కెప్టెన్ నిగర్ సుల్తానా జూనియర్ క్రికెటర్లను తన రూముకి పిలిచిమరీ కొడుతోందని ఆ జట్టు పేస్ బౌలర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసింది. ‘ఇది కొత్తేంకాదు. జూనియర్లను కొట్టడం నిగర్‌కు అలవాటే. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లోనూ నిగర్ తమను పలుమార్లు కొట్టిందని జూనియర్ క్రికెటర్లు నాతో చెప్పారు. ఇటీవలి దుబాయ్ పర్యటనలోనూ ఓ జూనియర్‌ను తన గదికి రప్పించుకొన్న నిగర్ ఆమె చెంప ఛెళ్లుమనిపించింది’ అని ఆలమ్ ఆరోపించింది. అయితే జట్టులో చోటు దక్కనందుకే జహనారా ఇలా ఆరోపణలు చేస్తోందని బంగ్లా క్రికెట్ బోర్డు వ్యాఖ్యానించింది.