Badminton: చాంపియన్ ఆయుష్
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:19 AM
భారత యువ షట్లర్ ఆయుష్ షెట్టి యూఎస్ ఓపెన్ టైటిల్‌తో అదరగొట్టాడు. మహిళల్లో16 ఏళ్ల టీనేజర్ తన్వీ శర్మ రన్నర్‌పగా సరిపెట్టుకొంది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో..
మహిళల రన్నరప్ తన్వీ
యూఎస్ ఓపెన్
లోవా (యూఎస్): భారత యువ షట్లర్ ఆయుష్ షెట్టి యూఎస్ ఓపెన్ టైటిల్‌తో అదరగొట్టాడు. మహిళల్లో16 ఏళ్ల టీనేజర్ తన్వీ శర్మ రన్నర్‌పగా సరిపెట్టుకొంది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఆయుష్ 21-18, 21-13తో మూడో సీడ్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై వరుస గేముల్లో నెగ్గాడు. ఈ క్రమంలో కెరీర్‌లో తొలిసారి బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు. కాగా, మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తన్వీ 11-21, 21-16, 10-21తో టాప్ సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది.