టెస్టు గద దక్కేదెవరికో
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:31 AM
చాంపియన్స్ ట్రోఫీ.. ఆ వెంటనే ధనాధన్ ఐపీఎల్‌తో మైమరిచిన క్రికెట్ ప్రేమికుల ముందుకు మరో అద్భుత సమరం రాబోతోంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు తలమానికంగా నిలిచే ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప...

నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా అమీతుమీ
మధ్యాహ్నం 3.00 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
లండన్: చాంపియన్స్ ట్రోఫీ.. ఆ వెంటనే ధనాధన్ ఐపీఎల్‌తో మైమరిచిన క్రికెట్ ప్రేమికుల ముందుకు మరో అద్భుత సమరం రాబోతోంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు తలమానికంగా నిలిచే ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో నేటి నుంచి జరిగే అంతిమ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండోసారి ఈ తుది పోరుకు అర్హత సాధించిన కమిన్స్ సేన అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఈసారీ అదిరే ప్రదర్శనతో మరో డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. అటు ఊహించని రీతిలో తుది పోరుకు అర్హత సాధించిన సఫారీలు తొలి ఐసీసీ టైటిల్‌ను దక్కించుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాగే రెండు దేశాలు కూడా తమ తుది జట్లను ఇదివరకే ప్రకటించాయి.
అనుభవం అండగా..: ఆసీస్ జట్టులో చాలామంది ఆటగాళ్లకు చివరి ఫైనల్లో ఆడిన అనుభవముంది. అందుకే ఒత్తిడిని తట్టుకుని చాంపియన్‌గా ఎలా నిలవాలో వారికి తెలుసు. ఓపెనర్‌గా ఖవాజాకు తోడు తొలిసారి లబుషేన్‌ను ఆడించనున్నారు. అలాగే కామెరూన్ గ్రీన్ వన్‌డౌన్‌లో సత్తా చాటాలనుకుంటున్నాడు. ఇక స్టీవ్ స్మిత్ నిలకడ, హెడ్ దూకుడు జట్టుకు బలం కానున్నాయి. అలాగే బౌలింగ్‌లో పేస్ త్రయం స్టార్క్, కమిన్స్, హాజెల్‌వుడ్‌లతో పాటు స్పిన్నర్ నాథన్ లియోన్‌ను అడ్డుకోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలే. ఈ నలుగురు కలిపి మొత్తం 1508 టెస్టు వికెట్లు తీయడం విశేషం. కమిన్స్ మరో ఆరుగురిని అవుట్ చేస్తే కెరీర్‌లో 300 వికెట్లు పూర్తి చేస్తాడు.
ఒత్తిడిని జయిస్తేనే..: దక్షిణాఫ్రికా జట్టులో మార్‌కరమ్, కెప్టెన్ బవుమాలకు మాత్రమే ప్రస్తుత ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవముంది. కానీ స్టబ్స్, రికెల్టన్ మాత్రం ఐపీఎల్‌లో ఆసీస్ పేసర్లను ఆడారు. సఫారీల బ్యాటింగ్ భారం కూడా ఈ నలుగురిపైనే ఉంది. సీనియర్ పేసర్ రబాడ ఇటీవల డోపింగ్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజా ఫైనల్లో అతడిపైనే అందరి దృష్టి నిలువనుంది. లార్డ్స్‌లో ఆడిన చివరి టెస్టులో అతడు ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అదే ఊపును ఈసారీ కొనసాగిస్తే ఆసీ్‌సకు కష్టకాలమే. ఎన్‌గిడి, యాన్సెన్ ఇతర పేసర్లు కాగా.. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ప్రభావం చూపాలనుకుంటున్నాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా: ఖవాజా, లబుషేన్, గ్రీన్, స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, క్యారీ, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, లియోన్, హాజెల్‌వుడ్.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్, రికెల్టన్, ముల్డర్, బవుమా (కెప్టెన్), స్టబ్స్, బెండిగమ్, వెరేయిన్, యాన్సన్, కేశవ్, రబాడ, ఎన్‌గిడి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి