Ashes First Test: హెడ్ ధనాధన్
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:32 AM
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీ్‌సలో తొలి టెస్టు సంచలనాత్మక రీతిలో రెండు రోజుల్లోనే ముగిసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టులో రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్...
రెండు రోజుల్లోనే ముగిసిన యాషెస్ తొలి టెస్టు
ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘనవిజయం
పెర్త్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీ్‌సలో తొలి టెస్టు సంచలనాత్మక రీతిలో రెండు రోజుల్లోనే ముగిసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టులో రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 123) తుఫాన్ శతకంతో చెలరేగాడు. దీంతో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 123/9తో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 132 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్‌కు 5, కార్స్‌కు 3, ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్ (37), పోప్ (33), డకెట్ (28) రాణించారు. బోలాండ్‌కు నాలుగు.. డొగెట్, స్టార్క్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో హెడ్ బాదుడుకు ఆసీస్ టీ20 తరహా ఆటతో చెలరేగి 28.2 ఓవర్లలోనే 205/2 స్కోరు చేసి నెగ్గింది. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన హెడ్, 69 బంతుల్లో శతకం కూడా అందుకున్నాడు. లబుషేన్ (51 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు 117 పరుగులు అందించాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది. పది వికెట్లు తీసిన స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండో టెస్టు డిసెంబరు 4న మొదలవనుంది.
1
గత వందేళ్లలో రెండు రోజుల్లోనే ముగిసిన తొలి యాషెస్ టెస్టు ఇది. ఓవరాల్‌గా ఆరోది.
2
యాషెస్ టెస్టుల్లో రెండో వేగవంతమైన (69 బంతుల్లో) శతకం బాదిన హెడ్. గిల్‌కిస్‌్ట్ర (57 బంతుల్లో) తొలి స్థానంలో ఉన్నాడు. నాలుగో ఇన్నింగ్స్ ఛేదనలో మాత్రం ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.
3
తక్కువ బంతుల్లో (847)నే ముగి సిన మూడో యాషెస్ టెస్టు ఇదే.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..