Share News

Test Match: ఆస్ట్రేలియా 225 ఆలౌట్‌

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:51 AM

వెస్టిండీ్‌సతో శనివారం ప్రారంభమైన మూడో టెస్ట్‌ (డే/నైట్‌) తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 225 పరుగులకే కుప్పకూలింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న...

Test Match: ఆస్ట్రేలియా 225 ఆలౌట్‌

కింగ్‌స్టన్‌: వెస్టిండీ్‌సతో శనివారం ప్రారంభమైన మూడో టెస్ట్‌ (డే/నైట్‌) తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 225 పరుగులకే కుప్పకూలింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఓ దశలో 157/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఈ దశలో వెస్టిండీస్‌ బౌలర్లు విజృంభించడంతో మిగిలిన ఏడు వికెట్లను కేవలం 68 పరుగులకే కోల్పోయింది. స్టీవెన్‌ స్మిత్‌ (48), గ్రీన్‌ (46) మాత్రమే రాణించారు. షామర్‌ జోసెఫ్‌ నాలుగు, జస్టిన్‌ గ్రీవ్స్‌, జేడెన్‌ సీల్స్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆతిథ్య జట్టు తొలిరోజు ఆఖరికి వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది. 100వ టెస్ట్‌ ఆడుతున్న ఆసీస్‌ పేసర్‌ స్టార్క్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

ఇవీ చదవండి:

రోహిత్ రికార్డుకు పంత్ ఎసరు!

ఒక్క ఓవర్‌కే భయపడతారా?

మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 03:51 AM