Share News

ఆసీస్‌ జట్టును ఆపేశారు

ABN , Publish Date - Jun 10 , 2025 | 04:55 AM

ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఈనెల 11 నుంచి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌ కోసం శనివారం ఈ స్టేడియానికి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చేదు అనుభవం...

ఆసీస్‌ జట్టును ఆపేశారు

లార్డ్స్‌లో చేదు అనుభవం

లండన్‌: ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఈనెల 11 నుంచి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌ కోసం శనివారం ఈ స్టేడియానికి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. ప్రస్తుతానికి ఈ స్టేడియం మీకు అందుబాటులో లేదని చెప్పి వారిని పంపించేసినట్టు బ్రిటిష్‌ మీడియా పేర్కొంది. అయితే అదే రోజు భారత టెస్టు జట్టుకు అనుమతి ఇవ్వడంతో వారు లార్డ్స్‌లో ప్రాక్టీస్‌ చేశారని అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ బుధవారం నుంచే ఉండగా.. ఇంగ్లండ్‌తో భారత్‌ సిరీ్‌సకు మరో పది రోజుల సమయం ఉంది. అలాంటప్పుడు ఆసీ్‌సకు కాకుండా గిల్‌ సేనకు ప్రాధాన్యత ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదీగాకుండా లార్డ్స్‌లో ఇంగ్లండ్‌-భారత్‌ మూడో టెస్టు జూలై 10న జరుగుతుందని గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి

లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 04:55 AM