Auqib Nabi: భారత జట్టు వైపు దూసుకొస్తున్న మరో సూపర్ పేసర్!
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:06 PM
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో జమ్ముకశ్మీర్ తరఫున 29 ఏళ్ల ఆకిబ్ నబీ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆకిబ్ 19 వికెట్లు తీశాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 7 వికెట్లు పడగొట్టాడు. అలానే రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగాడు.
దేశవాళీ క్రికెట్ నుంచి ఆకిబ్ నబీ(Auqib Nabi) అనే మరో పేస్ బౌలింగ్ సంచలనం భారత జట్టు వైపు దూసుకొస్తున్నాడు. తన అసాధారణ బౌలింగ్ స్పీడ్ తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తన పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లపై నిప్పులు చెరుగుతున్నాడు. అతడిని ఎదుర్కొవడం బ్యాటర్ల తరం కావడం లేదని క్రీడా నిపుణులు అంటున్నారు. తన తండ్రి ఆశయానికి భిన్నంగా ఈ కెరీర్‌ను ఎంచుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇతడు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్.
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో జమ్ముకశ్మీర్(Jammu Kashmir cricket) తరఫున 29 ఏళ్ల ఆకిబ్ నబీ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆకిబ్ 19 వికెట్లు తీశాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 7 వికెట్లు పడగొట్టాడు. అలానే రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా రాజస్థాన్(Rajasthan) మ్యాచ్‌లో అతడు పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ పై 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ తొలి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ప్రస్తుతం రంజీ సీజన్‌లో నకీబ్ ఇప్పటికి మొత్తంగా ఈ 24 వికెట్లు తీశాడు. అదే విధంగా దులీప్ ట్రోఫీ(Cricket News)లో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా ఆకిబ్ నబీ నిలిచాడు. తన ఫాస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు సాధించాడు.
ఇక నబీ బౌలింగ్ శైలి పరిశీలిస్తే.. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ ను పోలి ఉంటుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆకిబ్ ను 'బారాముల్లా డెేల్ స్టెయిన్'(Dale Steyn of Baramulla) అని పిలుస్తుంటారు. అద్భుతమైన పేస్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్‌కు ఉంది. ఆకిబ్‌ను తన తండ్రి డాక్టర్ చేయాలని ఆశించాడు. కానీ ఆకిబ్‌కు మాత్రం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అతడు తన అద్భుత సూప్ ప్రదర్శతో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడినట్లు సమాచారం. కాగా జమ్మూకు చెందిన మరో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్(Umran Malik) ఇప్పటికే టీమిండియా(Team India)కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గాయాల కారణంగా అతడు ఎక్కవ కాలం పాటు భారత జట్టుకు ఆడలేకపోయాడు. మొత్తంగా ఆకిబ్ నబీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ లో అదరగొడుతూ అందరిని ఆకట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
Abhishek Sharma: వారి వల్లే నేను చెలరేగుతున్నాను: అభిషేక్ శర్మ
ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి