Share News

అథ్లెట్‌ వర్షపై మూడేళ్ల నిషేధం

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:21 AM

లాంగ్‌డిస్టెన్స్‌ రన్నర్‌ వర్ష టేకమ్‌పై మూడేళ్ల నిషేధం విధించారు. అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) డోప్‌ టెస్ట్‌కు నమూనాలను...

అథ్లెట్‌ వర్షపై మూడేళ్ల నిషేధం

న్యూఢిల్లీ : లాంగ్‌డిస్టెన్స్‌ రన్నర్‌ వర్ష టేకమ్‌పై మూడేళ్ల నిషేధం విధించారు. అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) డోప్‌ టెస్ట్‌కు నమూనాలను ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమెపై ఈ చర్య తీసుకున్నారు. నిరుడు జరిగిన పుణె హాఫ్‌ మారథాన్‌లో వర్ష రెండో స్థానంలో నిలిచింది. గత నెల 26న ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించారు. డోపింగ్‌ నిబంధనలు ఉల్లఘించినట్టు ఆమె అంగీకరించడంతో తాజాగా మూడేళ్ల నిషేధం విధించినట్టు ఏఐయూ గురువారం వెల్లడించింది. గత నెల 20 నుంచి వర్షపై నిషేధం అమలులోకి వచ్చినట్టు పేర్కొంది.

Updated Date - Jun 06 , 2025 | 04:21 AM