Share News

Vennam Jyothi Surekha: ఆసియా క్రీడలే తదుపరి లక్ష్యం

ABN , Publish Date - Nov 27 , 2025 | 06:01 AM

ఆసియా క్రీడలే తన తదుపరి లక్ష్యమని స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ తెలిపింది. 2022 ఆసియా క్రీడల కాంపౌండ్‌ ఆర్చరీలో భారత్‌ కాంపౌండ్‌, రికర్వ్‌ విభాగాలలో కలిపి..

Vennam Jyothi Surekha: ఆసియా క్రీడలే తదుపరి లక్ష్యం

ఆర్చర్‌ జ్యోతి సురేఖ

హైదరాబాద్‌: ఆసియా క్రీడలే తన తదుపరి లక్ష్యమని స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ తెలిపింది. 2022 ఆసియా క్రీడల కాంపౌండ్‌ ఆర్చరీలో భారత్‌ కాంపౌండ్‌, రికర్వ్‌ విభాగాలలో కలిపి 5 స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు సాధించింది. ఇక..తదుపరి ఆసియా క్రీడలు వచ్చే ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో జపాన్‌లోని నగోయాలో జరగనున్నాయి. ఆ క్రీడల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో సురేఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

పుజారా బావమరిది ఆత్మహత్య

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!

Updated Date - Nov 27 , 2025 | 06:01 AM