Share News

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:52 AM

భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా...

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో అశ్విన్‌

కోయంబత్తూరు: భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతవారం మహిళా అంపైర్‌తో గొడవకు దిగిన అతను తాజాగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడంటూ మధురై పాంథర్స్‌ జట్టు ఫిర్యాదు చేసింది. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో అశ్విన్‌ దుండిగల్‌ డ్రాగన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈనెల 14న ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ‘డ్రాగన్స్‌ జట్టు ఆటగాళ్లు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదేపదే తుడిచారు. తద్వారా బంతి బరువును పెంచాలని చూశారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు తగిన ఆధారాలను చూపడంలో మధుర జట్టు విఫలమైందని టీఎన్‌పీఎల్‌ ప్రకటించింది.

ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌కు జడేజా భయం

బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 01:52 AM