Share News

నకమురతో అర్జున్‌ గేమ్‌ డ్రా

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:49 AM

ఫ్రీస్టయిల్‌ చెస్‌ గ్రాండ్‌ టూర్‌ పారిస్‌ అంచె..క్వార్టర్‌ఫైనల్‌ మొదటి గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి డ్రా చేసుకున్నాడు. అర్జున్‌-అమెరికన్‌ గ్రాండ్‌మాస్టర్‌ హికరు...

నకమురతో అర్జున్‌ గేమ్‌ డ్రా

పారిస్‌: ఫ్రీస్టయిల్‌ చెస్‌ గ్రాండ్‌ టూర్‌ పారిస్‌ అంచె..క్వార్టర్‌ఫైనల్‌ మొదటి గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి డ్రా చేసుకున్నాడు. అర్జున్‌-అమెరికన్‌ గ్రాండ్‌మాస్టర్‌ హికరు నకముర మధ్య బుధవారం జరిగిన ఈ గేమ్‌ 77 ఎత్తులపాటు హోరాహోరీగా సాగింది. తెల్లపావులతో ఆడిన అర్జున్‌ చివరకు నకమురను నిలువరించాడు. గురువారం జరిగే రెండో గేమ్‌లో నకముర తెల్లపావులతో ఆడతాడు. ఆ గేమ్‌ కూడా డ్రా అయితే విజేతను తేల్చేందుకు ప్లేఆఫ్స్‌ నిర్వహిస్తారు. విన్సెంట్‌ కీమర్‌-నెపోమ్నియాచి, లగ్రావ్‌-కరువానా మధ్య క్వార్టర్‌ఫైనల్స్‌ తొలి గేమ్‌లు కూడా ఫలితం తేలలేదు. అయితే అబ్దుసతొరోవ్‌పై కార్ల్‌సన్‌ విజయం సాధించాడు.

Updated Date - Apr 10 , 2025 | 03:13 AM