అర్జున్‌కు రజతం
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:03 AM
ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ అర్జున్ బబూటకు రజతం దక్కింది. ఆదివారం జరిగిన పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో అతను 252.3 పాయింట్లు సాధించగా.. కేవలం 0.1 పాయింట్ తేడాతో..
లిమా (పెరూ): ఐఎ్‌సఎ్‌సఎఫ్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ అర్జున్ బబూటకు రజతం దక్కింది. ఆదివారం జరిగిన పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో అతను 252.3 పాయింట్లు సాధించగా.. కేవలం 0.1 పాయింట్ తేడాతో ఒలింపిక్ చాంపియన్ షెంగ్ లిహావో (చైనా 252.4)కు స్వర్ణాన్ని కోల్పోవడం గమనార్హం. మరో భారత షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ నిబంధనల్ని అతిక్రమించి అనర్హతకు గురయ్యాడు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యంతో మూడో స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..