Archery Premier League: ఇక.. ఆర్చరీ లీగ్
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:07 AM
ప్రధాన క్రీడల్లో మాదిరే ఆర్చరీలోనూ ‘ఫ్రాంచైజీ’ అడుగుపెట్టింది. మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) అక్టోబరులో జరగనుంది.
అక్టోబరులో నిర్వహణ
సురేఖ, దీరజ్ సహా ఐదుగురు తెలుగు ఆర్చర్లకు చోటు
న్యూఢిల్లీ: ప్రధాన క్రీడల్లో మాదిరే ఆర్చరీలోనూ ‘ఫ్రాంచైజీ’ అడుగుపెట్టింది. మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) అక్టోబరులో జరగనుంది. ఆరు జట్లు ఇందులో తలపడుతున్నట్టు జాతీయ ఆర్చరీ సంఘం (ఏఏఐ) సోమవారం వెల్లడించింది. జ్యోతి సురేఖ, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవర, అభిషేక్ వర్మలాంటి స్టార్లు ఏపీఎల్ బరిలో దిగనున్నారు. సురేఖ, ధీరజ్ సహా మరో ముగ్గురు తెలుగు ఆర్చర్లు చికితా రావు, జిగ్నేష్, హంస కూడా లీగ్‌లో పోటీపడతారు. ఫ్రాంచైజీల పేర్లను ఖరారు చేయాల్సి ఉంది. తొలి సీజన్‌కు వేలంలో కాకుండా డ్రాఫ్ట్ విధానంలో ఆర్చర్లను జట్లు ఎంపిక చేసుకోనున్నాయి. ఒక్కో జట్టులో 8 మంది ఆర్చర్లుంటారు. ఇందులో నలుగురు పురుషులు, నలుగురు మహిళా ఆర్చర్లుంటారు. ప్రతి జట్టు ఇద్దరు విదేశీ ఆర్చర్లను చేర్చుకోవచ్చు.