World University Games 2025: అంకితకు రజతం
ABN , Publish Date - Jul 28 , 2025 | 02:43 AM
జర్మనీలోని ఎస్సెన్ నగరంలో ఆదివారం ముగిసిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలను భారత్ మొత్తం 12 పతకాల (2-5-5)తో ముగించింది. చివరి రోజు..మహిళల మూడువేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అంకిత ధ్యానీ రజతం సాధించింది...
భారత్‌కు 12 పతకాలు
ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు
న్యూఢిల్లీ: జర్మనీలోని ఎస్సెన్ నగరంలో ఆదివారం ముగిసిన ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలను భారత్ మొత్తం 12 పతకాల (2-5-5)తో ముగించింది. చివరి రోజు..మహిళల మూడువేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అంకిత ధ్యానీ రజతం సాధించింది. ఇక, పురుషుల 4గీ100 మీ. రిలేలో, మహిళల 20 కి.మీ. రేస్‌వాక్ టీమ్ ఈవెంట్‌లో మనోళ్లు కాంస్యాలు నెగ్గారు. ఆఖరి రోజు పలువురు భారత అథ్లెట్లు ట్రాక్ విభాగాలలో తలపడినా..కేవలం రెండు పతకాలే లభించాయి. 23 ఏళ్ల అంకిత తొమ్మిది నిమిషాల 31.99 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో రేస్‌ను పూర్తి చేసి రజతం దక్కించుకుంది. ఫిన్లాండ్, జర్మనీ అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. లాలూ ప్రసాద్, అనిమేష్ కుజుర్, మణికంఠ, మృత్యుంజయరాంతో కూడిన జట్టు 4గీ100 మీ. రిలేను 38.89 సెకన్లతో పూర్తి చేసి కాంస్యం చేజిక్కించుకుంది. దక్షిణకొరియా స్వర్ణం, దక్షిణాఫ్రికా కాంస్య పతకం నెగ్గాయి. మునిత, మాన్సీ, సెజాల్‌తో కూడిన భారత త్రయం మహిళల 20 కి.మీ. టీమ్ రేస్‌వాక్‌లో (4:56:06) కాంస్యం గెలుపొందింది. చైనా స్వర్ణం, ఆస్ట్రేలియా రజతం అందుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..