Young shooter: అనుయ అదరగొట్టింది..
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:57 AM
యువ షూటర్ అనుయ ప్రసాద్ అదరగొట్టింది. పుట్టిన రోజును మరపురానిదిగా చేసుకుంది. టోక్యోలో జరుగుతున్న బధిర ఒలింపిక్స్‌లో....
ప్రపంచ రికార్డుతో స్వర్ణం
ప్రాంజలికి రజతం
న్యూఢిల్లీ: యువ షూటర్ అనుయ ప్రసాద్ అదరగొట్టింది. పుట్టిన రోజును మరపురానిదిగా చేసుకుంది. టోక్యోలో జరుగుతున్న బధిర ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అనుయ ప్రసాద్ ప్రపంచ రికార్డు స్కోరు (241.1 పాయింట్లు)తో పసిడి పతకం కొల్లగొట్టగా, భారత్‌కే చెందిన మరో షూటర్ ప్రాంజలి ప్రశాంత్ ధూమల్ రజతం (236.8 పాయింట్లు)తో మెరిసింది. ప్రాంజలి 572 పాయింట్లతో క్వాలిఫికేషన్‌లో వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇక పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో 18 ఏళ్ల అభినవ్ దేశ్వాల్ 235.2 పాయింట్ల స్కోరుతో రజతం అందుకున్నాడు. అంతకుముందు అభినవ్ 576 పాయింట్లతో క్వాలిఫికేషన్‌లో ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేశాడు. కాగా..కొరియా, క్రొయేషియా షూటర్లు స్వర్ణ, కాంస్య పతకాలు గెలుపొందారు.