Anish Bhanwal Wins Silver: అనిషాకు రజతం
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:27 AM
వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత షూటర్ అనీష్ భన్వాల్ రజతం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో....
వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్
కైరో (ఈజిప్ట్): వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత షూటర్ అనీష్ భన్వాల్ రజతం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అనీష్ మొత్తం 28 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. బెస్సాగ్వెట్ (ఫ్రాన్స్) స్వర్ణం.. హొరోడైనెట్స్ (ఉక్రెయిన్) కాంస్యం దక్కించుకొన్నారు. వరల్డ్ చాంపియన్‌షి్‌పలో 25మీటర్ల ర్యాపిడ్‌ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా అనీష్ రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా క్వాలిఫయింగ్ రౌండ్‌లో 585 పాయింట్లతో రెండో స్థానం సొంతం చేసుకొన్న అనీష్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.