Share News

రికార్డులు తిరగరాసిన ఆండ్రీవా

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:11 AM

రష్యన్‌ టీనేజర్‌ మిర్రా ఆండ్రీవా సంచలనం సృష్టించింది. వరల్డ్‌ నెం:1 అరియానా సబలెంక (బెలార్‌స)ను 2-6, 6-4, 6-3తో ఓడించి ఇండియన్‌ వెల్స్‌ టైటిల్‌ను..

రికార్డులు తిరగరాసిన ఆండ్రీవా

ఇండియన్‌ వెల్స్‌ టైటిల్‌ కైవసం

ఇండియన్‌ వెల్స్‌ (యూఎస్‌): రష్యన్‌ టీనేజర్‌ మిర్రా ఆండ్రీవా సంచలనం సృష్టించింది. వరల్డ్‌ నెం:1 అరియానా సబలెంక (బెలార్‌స)ను 2-6, 6-4, 6-3తో ఓడించి ఇండియన్‌ వెల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకొంది. ఈ క్రమంలో 1999లో సెరెనా విలియమ్స్‌ తర్వాత ఈ టోర్నీ నెగ్గిన పిన్నవయస్కురాలిగా 17 ఏళ్ల ఆండ్రీవా రికార్డులకెక్కింది. అంతేకాకుండా డబ్ల్యూటీఏ ఈవెంట్‌లో వరల్డ్‌ నెం:1, 2 ప్లేయర్లను ఓడించిన రెండో అండర్‌-18 ప్లేయర్‌గా కూడా మిర్రా నిలిచింది. 1999 యూఎస్‌ ఓపెన్‌లో డావెన్‌పోర్ట్‌, మార్టినా హింగి్‌సలను సెరెనా ఓడించింది. 2005లో మరియా షరపోవా తర్వాత డబ్ల్యూటీఏ ట్రోఫీ ఫైనల్లో టాప్‌ ర్యాంకర్‌ను ఓడించిన చిన్న వయసు ప్లేయర్‌గానే కాకుండా.. 1997లో హింగిస్‌ తర్వాత వరుసగా రెండో డబ్ల్యూటీఏ 1000 టైటిల్‌ సాధించిన క్రీడాకారిణిగా కూడా ఆండ్రీవా చరిత్ర సృష్టించింది.

Read Also : Sourav Ganguly in Khakee: ఖాకీ సిరీస్‌‌లో గంగూలీ.. టీజర్‌లో షాకిచ్చిన బెంగాల్ టైగర్.. అసలు కథేంటంటే..

ఇండియాదే ‘మాస్టర్స్‌’

ఫ్యామిలీ ఉండాల్సిందే!

Updated Date - Mar 18 , 2025 | 04:11 AM