ఆ జట్టులో విషపు వ్యక్తులున్నారు
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:44 AM
దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లీర్స్.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అద్భుత ప్రదర్శన కనబరచాడు. 2008 నుంచి 2010 వరకు...
ఢిల్లీపై డివిల్లీర్స్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లీర్స్.. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అద్భుత ప్రదర్శన కనబరచాడు. 2008 నుంచి 2010 వరకు మూడేళ్లపాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన డివిల్లీర్స్ ఆ తర్వాత బెంగళూరుకు మారాడు. అయితే, బెంగళూరు జట్టు తరఫున రాణించిన తరహాలో ఢిల్లీకి ఆడలేకపోయాడు. అందుకు గల కారణాన్ని అతడు ఇప్పుడు బయటపెట్టాడు. తాను ఆడే రోజుల్లో ‘ఢిల్లీలో విషపు మనస్తత్వం గల వారున్నార’ని చెప్పాడు. కానీ, వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ‘వారి పేర్లు పలకడం కూడా ఇష్టంలేదు. ఎప్పుడూ రగిలిపోతూ.. విషాన్ని చిమ్ముతుండేవారు. అయితే, మెక్‌గ్రాత్, వెటోరి లాంటి వారితో ఆడడం తీపి జ్ఞాపకమ’ని డివిల్లీర్స్ చెప్పాడు.
ఇవీ చదవండి:
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి