Jakhongir Siddirov: 19 ఏళ్ల కుర్రాడు కప్ కొట్టాడు
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:08 AM
ఉజ్బెకిస్థాన్ చెస్ ఆటగాడు జావోఖిర్ సిందరోవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ 19 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ ఫిడే వరల్డ్ కప్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో సిందరోవ్...
చెస్ వరల్డ్ కప్ విజేత సిందరోవ్
పనాజీ: ఉజ్బెకిస్థాన్ చెస్ ఆటగాడు జావోఖిర్ సిందరోవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ 19 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ ఫిడే వరల్డ్ కప్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో సిందరోవ్ 2.5-1.5తో చైనా గ్రాండ్‌మాస్టర్, 26 ఏళ్ల వీ యీని ఓడించాడు. తద్వారా పిన్న వయసులో ఫిడే వరల్డ్ కప్ నెగ్గిన ఆటగాడిగా సిందరోవ్ రికార్డుకెక్కాడు. ఈ ఏడాది మహిళల వరల్డ్ కప్ నెగ్గిన భారత అమ్మాయి దివ్యా దేశ్‌ముఖ్ వయసు కూడా 19 ఏళ్లే కావడం విశేషం.
ఫైనల్ పోరులో భాగంగా తొలి రెండు గేమ్‌లను సిందరోవ్, వీ యీ డ్రాగా ముగించడంతో.. ఫలితం కోసం టైబ్రేక్‌కు వెళ్లారు. బుధవారం జరిగిన టైబ్రేక్ తొలి రౌండ్‌లో వీ యీని డ్రాతో నిలువరించిన సిందరోవ్ రెండో రౌండ్లో విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచాడు. సిందరోవ్‌కు ట్రోఫీతో పాటు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కింది. ఫైనల్ చేరడం ద్వారా వీళ్లిద్దరూ ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ నుంచి తెలుగు ఆటగాడు అర్జున్ ఇరిగేసి క్వార్టర్‌ఫైనల్లో పరాజయం పాలయ్యాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!