Share News

World Swimming Championship 2025: చైనా చిన్నది ఫైనల్‌ చేరింది

ABN , Publish Date - Jul 28 , 2025 | 02:39 AM

ఈత కొలనులో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న 12 ఏళ్ల చైనా టీనేజ్‌ స్విమ్మర్‌ యు జిడి ఊహించినట్లే అంతర్జాతీయ స్విమ్మింగ్‌లోనూ సంచలనం దిశగా దూసుకెళ్తోంది. ఇటీవల చైనా చాంపియన్‌షి్‌పలో అద్భుత ప్రదర్శన చేసి...

World Swimming Championship 2025: చైనా చిన్నది ఫైనల్‌ చేరింది

ప్రపంచ స్విమ్మింగ్‌లో 12 ఏళ్ల జిడి సంచలనం

సింగపూర్‌: ఈత కొలనులో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న 12 ఏళ్ల చైనా టీనేజ్‌ స్విమ్మర్‌ యు జిడి ఊహించినట్లే అంతర్జాతీయ స్విమ్మింగ్‌లోనూ సంచలనం దిశగా దూసుకెళ్తోంది. ఇటీవల చైనా చాంపియన్‌షి్‌పలో అద్భుత ప్రదర్శన చేసి ప్రపంచ టోర్నీకి అర్హత సాధించిన ఈ చిన్నది.. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షి్‌పలోనూ తన అరంగేట్రాన్ని ఘనంగా చాటింది. ఈ మెగా టోర్నీలో 200 మీటర్లు, 400 మీటర్లు వ్యక్తిగత మెడ్లే, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగాల్లో పోటీపడుతోన్న యు జిడి.. ఆదివారం ఇక్కడ జరిగిన 200 మీటర్ల మెడ్లేలో ఫైనల్‌ చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట 2 నిమిషాల 11.90 సెకన్ల టైమింగ్‌తో సెమీఫైనల్‌ చేరింది. మొత్తం 16 మంది క్వాలిఫయర్స్‌లో జిడి 15వ ఫాస్టెస్ట్‌ టైమ్‌ నమోదు చేసింది. అనంతరం సెమీ్‌సలో 2 నిమిషాల 10.22 సెకన్ల టైమింగ్‌తో ఏడోస్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఫైనల్లో పోటీపడుతోన్న ఒలింపిక్‌ చాంపియన్‌, ప్రపంచ రికార్డు గ్రహీత సమ్మర్‌ మెకింతో్‌షకు ఇప్పుడు జిడి గట్టి పోటీదారుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 02:39 AM