UK Water Crisis: పాత మెయిల్స్‌ను డిలీట్ చేయండి.. నీటిని ఆదా చేయండి.. పౌరులకు యూకే ప్రభుత్వ సూచన
ABN , Publish Date - Aug 13 , 2025 | 07:12 PM
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం నాలుగో హీట్‌వేవ్‌ను ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్‌లోని ఐదు ప్రాంతాల్లో కరువు ఉన్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అలాగే మరో ఆరు ప్రదేశాల్లో పొడి వాతావరణం ఉందని పేర్కొంది.
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం నాలుగో హీట్‌వేవ్‌ను ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్‌లోని ఐదు ప్రాంతాల్లో కరువు ఉన్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది (Drought in England). అలాగే మరో ఆరు ప్రదేశాల్లో పొడి వాతావరణం ఉందని పేర్కొంది. దీంతో నీటి సంరక్షణ దేశానికి అత్యంత కీలకం అని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు (Save Water). నీటి కరువును ఎదుర్కొంటున్న ప్రదేశాల్లో ఉంటున్నవారు కచ్చితంగా కొన్ని నిబంధనలను పాటించాలని ప్రకటించారు (UK Water Crisis).
లక్షల మంది ప్రజలకు వచ్చిన పాత ఈమెయిల్స్‌ను, ఫొటోలను భద్రపరిచేందుకు భారీ డేటా సెంటర్లు అవసరం (Delete Emails). ఆయా డేటా సెంటర్ల (Data Centers)లోని సిస్టమ్స్‌ను చల్లబరిచేందుకు భారీగా నీరు అవసరం అవుతుంది. భారీ డేటా సెంటర్లు రోజుకు 50 లక్షల గ్యాలెన్ల నీటిని వాడుకుంటాయి. ఆ నీరు 50 వేల జనాభా ఉన్న పట్టణ అవసరాలకు సరిపోతుంది. ఈ క్రమంలో నీటి వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులకు ఓ సూచన చేసింది. పాత, అనవసరమైన ఈ-మెయిల్స్‌ను డిలీట్ చేయాలని సూచించింది. డేటా సెంటర్లపై ఒత్తిడి తగ్గించాలని పేర్కొంది.
అలాగే బ్రిటన్ ప్రభుత్వం మరికొన్ని నిబంధనలను కూడా పాటించాలని సూచించింది. టాయిలెట్లు, వాష్‌రూమ్‌ల్లో లీకేజీలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వంట గదిలో ఉపయోగించే నీటిని మొక్కలకు మళ్లించాలని, షవర్ కింద తక్కువ సమయం గడపాలని సూచించింది. అలాగే గార్డెన్ అవసరాల కోసం వర్షపు నీటిని సేకరించే రెయిన్ బట్‌లను ఇళ్లలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. షేవింగ్ చేసుకునే సమయంలోనూ, బ్రష్ చేసేటపుడు ట్యాప్‌ను కట్టెయ్యాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
ఈ గడ్డిలో పురుగు కనబడిందా.. మీ కళ్లకు ఇక తిరుగులేనట్టే..
పనిలో పడి కొడుకును పట్టించుకోలేదు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..