Sadar Sammelanam: ఎన్టీఆర్ స్టేడియం వద్ద సదర్ సమ్మేళనం.. ప్రారంభించిన సీఎం రేవంత్
ABN, Publish Date - Oct 19 , 2025 | 04:01 PM
హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ రామచంద్ర రావు , మంత్రులు పొన్నం ప్రభాకర్ , వాకాటి శ్రీహరి ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పలువురు యాదవ సంఘాలు నేతలు ఈ సదర్ కార్యక్రమానికి విచ్చేశారు.
1/12
యాదవోంకా ఖదర్... హైదరాబాద్ సదర్ అని తెలంగాణ ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.
2/12
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవ సోదరులు నమ్మకానికి మారుపేరు వంటివారన్నారు.
3/12
తెలంగాణ ఏర్పాటులో.. అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.
4/12
తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిధులు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
5/12
సంక్షేమంతోపాటు రాజకీయాల్లో సైతం యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
6/12
కొన్ని సార్లు ఆలస్యమైనా సరే.. అవకాశాలు కల్పించి సముచిత గౌరవం అందిస్తామని చెప్పారు. మీకు ఏ సమస్య ఉన్నా.. ప్రభుత్వం వద్దకు రావాలని వారికి సూచించారు.
7/12
మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని ఈ సందర్భంగా వారికి ఆయన హామీ ఇచ్చారు.
8/12
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవ సోదరుల సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మీ సహకారం ఎప్పుడూ ఇలాగే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
9/12
ఈ సందర్భంగా సదర్ సమ్మేళనంలో తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భారీ దున్నరాజుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.
10/12
ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితర నేతలు పాల్గొన్నారు.
11/12
ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతి, సంప్రదాయ కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
12/12
ప్రతి ఏటా దీపావళి పండగ సందర్భంగా సదర్ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే.
Updated at - Oct 19 , 2025 | 04:04 PM