Share News

NRI News: అమెరికాలో హృదయ నాదం.. సంగీతకారుడు వీణాపాణికి సత్కారం..

ABN , Publish Date - Aug 25 , 2025 | 09:16 PM

వినాయక నవరాత్రుల్లో భాగంగా అమెరికా బే ఏరియాలోని సత్యనారాయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'హృదయ నాదం' పేరుతో సంగీత విభావరిని ఘనంగా నిర్వహించారు. సంగీతం పై అనేక ప్రయోగాలు చేసిన ప్రముఖ సంగీతకారుడు వీణాపాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

NRI News: అమెరికాలో హృదయ నాదం.. సంగీతకారుడు వీణాపాణికి సత్కారం..
NRI News

వినాయక నవరాత్రుల్లో భాగంగా అమెరికా బే ఏరియాలోని సత్యనారాయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'హృదయ నాదం' పేరుతో సంగీత విభావరిని ఘనంగా నిర్వహించారు. సంగీతం పై అనేక ప్రయోగాలు చేసిన ప్రముఖ సంగీతకారుడు వీణాపాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీతం ద్వారా మానసిక ప్రశాంతత చేకూర్చే ప్రక్రియను ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో వీణాపాణికి ప్రవాసాంధ్రులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపించారు (NRI News).


'భారతీయ సంస్కృతిలో సంగీతం ఒక భాగం. ఉరుకుల పరుగుల జీవితాలతో ప్రతిఒక్కరూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక ప్రశాంతతను చేకూర్చే సంగీతాన్ని వీణాపాణి రూపొందించారు. ఈ ప్రక్రియ చాలా చక్కటి ఫలితాలను ఇస్తోంది. అలాగే మరో ప్రక్రియలో వీణాపాణి 72 మేళకర్త రాగాలను 61 గంటల 20 నిముషాల పాటు లండన్‌లో ఆవిష్కరణ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో స్థానం దక్కించుకున్నారు' అని వక్తలు కొనియాడారు. 'సంగీతం మనిషి జీవితంలోని ఒత్తిడి, ఆందోళన, అలసటలను తొలిగించి ఆనందాన్ని ఇస్తుంది. మనసును ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తుంది. సంగీతానికి ఎల్లలు లేవు. భాషతో సంబంధం లేద'ని కార్యక్రమానికి హాజరైన అతిథులు పేర్కొన్నారు.

nri2.jpg


ఈ సందర్భంగా స్వర వీణాపాణిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఆలయ కమిటీ నిర్వాహకులు మారేపల్లి నాగ వెంకట శాస్త్రి, తల్లాప్రగడ రావు, నేమాని రాజశేఖర్, మృదంగ విద్వాన్ నేమాని భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 09:17 PM